News May 1, 2024

క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ!

image

అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ (46) లాటరీలో ఏకంగా రూ.10వేల కోట్లు గెలుచుకున్నారు. భార్య, స్నేహితుడితో కలిసి అతడు పవర్ బాల్‌‌లో 20 లాటరీ టికెట్లు కొన్నారు. గత నెలలో డ్రా తీసిన నిర్వాహకులు సైఫాన్‌ను జాక్‌పాట్ విజేతగా ప్రకటించారు. అతడు 1.3బిలియన్ డాలర్లు అంటే ₹10,930 కోట్లు గెలుచుకున్నట్లు తెలిపారు. ట్యాక్స్‌లు పోగా తనకు వచ్చే డబ్బులో సగం స్నేహితుడికి ఇవ్వనున్నట్లు సైఫాన్ తెలిపారు.

Similar News

News December 9, 2025

మచ్చలు పడుతున్నాయా?

image

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.

News December 9, 2025

ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

image

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 9, 2025

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(2/2)

image

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.