News October 7, 2025

నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: విద్యార్థులకోసం కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(NMMSS) ఎగ్జామ్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. NMMSSకు ఎంపికైతే నెలకు రూ.వెయ్యి చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు కేంద్రం అందించనుంది.
వెబ్‌సైట్: bse.telangana.gov.in

Similar News

News January 23, 2026

కల్తీనెయ్యి కేసులో CBI ఫైనల్ ఛార్జిషీట్

image

తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీనెయ్యి వ్యవహారంపై CBI నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చగా, మరో 12 మందిని ఇందులో చేరుస్తూ ఇవాళ అభియోగపత్రం దాఖలు చేసింది. ఛార్జిషీట్లో 11 మంది TTD ఉద్యోగులు, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సహా AR డెయిరీ, భోలేబాబా డెయిరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి.

News January 23, 2026

ఉద్యోగంలో ఎదగాలంటే..?

image

వృత్తి ఉద్యోగాల్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. మీ రంగంలో ఎంత అనుభవం ఉన్నా మీ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాగే ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం నేర్చుకోవాలి. టార్గెట్లు పెట్టుకోండి. వాటిని చేరే విధంగా ఆలోచనలు, పనులు ఉండాలి. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూసుకోవాలి.

News January 23, 2026

ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

image

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.