News August 20, 2025

మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

image

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.

Similar News

News January 15, 2026

పతంగుల జోరు.. యమపాశం కావొద్దు: సజ్జనార్

image

TG: సంక్రాంతికి పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ అని, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోందని HYD CP సజ్జనార్ అన్నారు. ‘చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు’ అని ట్వీట్ చేశారు.

News January 15, 2026

ఇవి తీసుకుంటే PCODకి చెక్

image

ఈ మధ్య కాలంలో మహిళలను PCOD ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ అస్తవ్యస్తంగా మారతాయని నిపుణులు. అయితే ఇది తగ్గాలంటే ఆహారంలో దాల్చిన చెక్క పొడి, పుదీనా టీ, ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.

News January 15, 2026

ఎన్టీఆర్ అదిరిపోయే లుక్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చారు. బియర్డ్ లుక్‌లో సూపర్బ్ స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన భారీగా గడ్డం పెంచారు. తాజాగా కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పలువురు SMలో షేర్ చేశారు. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.