News May 22, 2024
ఇవాళ రాత్రి నుంచి అకౌంట్లలోకి రూ.16వేలు.. కేంద్రం రియాక్షన్ ఇదే..

ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ప్రతి ఒక్కరి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం రూ.16 వేలు జమ చేస్తుందని ఓ యూట్యూబ్ ఛానల్‌లో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏమీ లేదని పేర్కొంది. ఇలాంటి ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘సర్కారీ ఖబర్21’ అనే యూట్యూబ్ ఛానల్ థంబ్ నెయిల్ ఫొటోను షేర్ చేస్తూ ఫేక్ అని తెలిపింది.
Similar News
News March 9, 2026
త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.
News March 9, 2026
భారీ నష్టం తప్పదు.. ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

తమపై దాడులు చేస్తోన్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఫైరవుతున్నాయి. అరబ్ దేశాలపై అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. అతి పెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై దాడిని ఖండించింది. ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేయట్లేదని చెబుతూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని మండిపడింది.
News March 9, 2026
బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.


