News September 11, 2024
వారికి రూ.25,000 సాయం!
AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
Similar News
News October 9, 2024
GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు
విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM
AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.
News October 9, 2024
జో రూట్ సరికొత్త మైలురాయి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సరికొత్త మైలురాయి అందుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీ బాదారు. ఇప్పటివరకు ఆయన 35 శతకాలు సాధించారు. ఈ క్రమంలో లారా, గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్ధనే (34)లను ఆయన అధిగమించారు. ఓవరాల్‌గా సచిన్ (51), కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (35) టాప్‌లో ఉన్నారు.