News March 28, 2024

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

image

ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దైంది. దాంతో భర్త పదే పదే ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. ఇటీవల ఇద్దరూ విడిపోయారు. అనంతరం భార్య భర్త తనను హింసించాడంటూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాటలతో, చేష్టలతో వేధించాడని పేర్కొంది. దీంతో సదరు భర్త ఆమెకు ప్రతి నెల రూ.1.50 లక్షల భరణం, సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు గాను రూ.3 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

Similar News

News February 9, 2026

జంద్యం ధరిస్తున్నారా?

image

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.

News February 9, 2026

గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.

News February 9, 2026

ఇంటర్వ్యూతో DMSRDEలో పోస్టులు

image

కాన్పూర్‌లోని DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), PG, BE, BTech/ ME, MTech, NET, GATE అర్హతగల వారు ఫిబ్రవరి 11న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in