News April 14, 2024

విద్యుత్ షాక్‌తో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

image

TG: విద్యుత్ షాక్‌తో మరణిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ పరిహారం అందజేస్తుంది. ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ సంబంధిత డాక్యుమెంట్లను విద్యుత్ కార్యాలయంలో సమర్పిస్తే ఏఈ, డీఈ విచారణ ఆధారంగా పరిహారాన్ని పొందవచ్చు. శాఖ పరమైన తప్పిదాల వల్ల మరణిస్తేనే పరిహారం చెల్లిస్తారు.

Similar News

News December 8, 2025

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

image

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.

News December 8, 2025

RITESలో 400 పోస్టులు.. అప్లై చేశారా?

image

RITES 400 కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ. 42,478 చెల్లిస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 8, 2025

భారీ జీతంతో AMPRIలో 20 పోస్టులు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(AMPRI)లో 20సైంటిస్ట్, Sr సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.TECH, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన సైంటిస్ట్‌కు నెలకు రూ.1,26,900, Sr సైంటిస్ట్‌కు రూ.1,46,770 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in/