News April 27, 2024

రైతు కుటుంబాల్లో పెళ్లిళ్లకు రూ.50వేల సాయం?

image

AP: సీఎం జగన్ ఇవాళ ఉ.11కు నవరత్నాలు ప్లస్ పేరుతో YCP మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పాత పథకాల ఆర్థిక సాయాన్ని పెంచి, కొత్తగా రైతుల పిల్లల వివాహాలకు రూ.50 వేల సాయం అందిస్తారని సమాచారం. చిరువ్యాపారులకు ఇస్తున్న నగదును రూ.15వేలకు పెంచుతారట. గ్రోత్ సెంటర్లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇప్పిస్తారని తెలుస్తోంది. ఉద్యోగాలు పొందే వరకు యువతులకు రూ.3వేలు, యువకులకు రూ.2,500 స్టైఫండ్ ఇస్తారని టాక్.

Similar News

News April 15, 2026

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.

డీలిమిటేషన్ బిల్లు.. NDAకు మెజార్టీ ఉందా?

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల రాజ్యాంగ సవరణల ఆమోదానికి లోక్‌సభలో 364మంది సభ్యుల మద్దతు అవసరం. NDAకు 293మంది MPలు ఉన్నారు. దీంతో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి BJP యత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక NDA పార్టీలన్నీ తమ MPలకు విప్ జారీ చేశాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఆయా పార్టీల మహిళా నేతలను LS గ్యాలరీకి రప్పిస్తున్నారు.