News March 28, 2024

రూ. 20లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ

image

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా రూ.20లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న సంస్థ షేర్ వాల్యూ రూ.2987ను తాకడంతో రిలయన్స్ విలువ రూ.70,039 కోట్ల మేర పెరిగి రూ.20,21,486 కోట్లను తాకింది. కాగా.. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో TCS(రూ.14 లక్షల కోట్లు), HDFC (రూ.11 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ.7 లక్షల కోట్లు) ఉన్నాయి.

Similar News

News February 18, 2026

ఇండియా Vs సౌతాఫ్రికా.. అన్నదమ్ముల పోరు!

image

T20 WC <<19168527>>సూపర్-8<<>>లో భాగంగా ఈనెల 22న ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్లకు అన్నదమ్ములు కోచింగ్ స్టాఫ్‌గా ఉండటం గమనార్హం. SAకు అల్బీ మోర్కెల్ కన్సల్టింగ్ కోచ్‌గా, INDకు బౌలింగ్‌ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నారు. ‘ఈ మ్యాచ్ విషయంలో మా ఇద్దరి కంటే అమ్మ ఎక్కువగా ఆందోళన చెందుతోందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే IND, SAలో ఎవరికి మద్దతివ్వాలో ఆమెకు తెలియట్లేదు’ అని అల్బీ చెప్పారు.

News February 18, 2026

హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

image

తల స్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘మొదటి వాష్‌తో మురికి, ఆయిల్, చెమట, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. తల శుభ్రంగా ఉండటంతో అందులోని ప్రోటీన్లు నేరుగా చొచ్చుకెళ్తాయి. తల చర్మం, జుట్టు మరింత దృఢంగా మారుతాయి‘ అని అంటున్నారు.

News February 18, 2026

ఇంటి దేవుడిని పూజించడానికి అనువైన రోజు ఏదంటే?

image

కుజ గ్రహం, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఈ రోజున ఇంటి దేవుడిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు పండితులు. ‘మంగళవారం రోజున ఇలవేల్పును పూజిస్తే జాతక దోషాలు తొలగి, మనసులో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఈరోజు చేసే ప్రత్యేక పూజలతో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. కుటుంబీకులు అందరూ పూజలో పాల్గొనడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.