News May 7, 2025

RTCని కనుమరుగు చేసిన కేసీఆర్: జగ్గారెడ్డి

image

RTCని కేసీఆర్ కనుమరుగు చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉచిత బస్సుకు కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్లేనని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు నష్టం కలుగుతుంది కాబట్టే వెస్ట్ అంటున్నారని పేర్కొన్నారు. RTCకి దానికి ప్రాణం పోసిన ఘనత రాహుల్ గాంధీ, అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

KMR: కూరగాయల ధరలపై లుక్కెద్దాం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాట రూ.15, గోరుచిక్కుడు 50, బెండకాయ 40, దోసకాయ 40, బీరకాయ 50, ఆలుగడ్డ 40, క్యారెట్ 40, బీట్ రూట్ 50, పచ్చిమిర్చి 50, పాలకూర 40, క్యాబేజీ 50, కాలీఫ్లవర్ 60, వంకాయ 50, దొండకాయ 50, చిక్కుడు కాయ 50, ఉల్లిగడ్డ 30, ఎల్లిగడ్డ 200, అల్లం 80, మూలగకాయ 60, మెంతి, కొత్తిమీర రూ.10 (ఒక కట్ట)

News February 18, 2026

జనగామ పురపాలకలో పునరావృతమైన 1982

image

జనగామ పురపాలక చరిత్రలో 44 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ వాతావరణం మరోసారి జరిగింది. 1982లో మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో వీరారెడ్డి భాస్కర్ రెడ్డి, రొండ్ల లక్ష్మారెడ్డికి సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానంలో డ్రా తీసి భాస్కర్ నిరెడ్డి ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మళ్లీ నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతినే ఛైర్మన్ ఎన్నిక జరిగింది.

News February 18, 2026

నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

image

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.