News November 19, 2024
రష్యా VS ఉక్రెయిన్: వెయ్యి రోజుల వినాశనం విలువెంతంటే?
రష్యా, ఉక్రెయిన్ వివాదం మొదలై నేటికి 1000 రోజులు. WW II తర్వాత అత్యంత వినాశకర యుద్ధం ఇదేనని విశ్లేషకుల అంచనా. రెండువైపులా 10లక్షలకు పైగా మరణించారని సమాచారం. ఉక్రెయిన్‌లో ఐదో వంతు అంటే గ్రీస్‌తో సమానమైన భూభాగాన్ని రష్యా అధీనంలోకి తీసుకుంది. 2022తో పోలిస్తే ఆ దేశ ఎకానమీ 33% పడిపోయింది. మొత్తంగా $152 బిలియన్లు నష్టపోయింది. ఒకప్పటిలా మౌలిక సదుపాయాలు నిర్మించాలంటే $485 బిలియన్లు అవసరమని WB అంచనా.
Similar News
News December 9, 2024
మంచు మనోజ్ కడుపు, వెన్నెముకకు గాయాలు
మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.
News December 9, 2024
ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రేవంత్: హరీశ్ రావు
TG: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు. ఆమె విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? అని ప్రశ్నించారు.
News December 9, 2024
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చింది ఈరోజే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.