News May 13, 2024

రష్యా రక్షణమంత్రి తొలగింపు!

image

రికార్డు స్థాయిలో ఆరోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్, అధికారంలోకి రాగానే రక్షణమంత్రి షోయిగూను తొలగించారు. మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ను కొత్త రక్షణ మంత్రిగా ప్రతిపాదించారు. 2012 నుంచి మంత్రిగా ఉన్న షోయిగూను రష్యా భద్రత మండలి కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఆ పదవిలోనే కొనసాగుతారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.

Similar News

News December 12, 2025

ఈ సీజన్‌లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

News December 12, 2025

డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

image

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.

News December 12, 2025

ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.