News September 10, 2025
సబిత, సునీత కాంగ్రెస్‌లో చేరట్లేదు: బీఆర్ఎస్ నేత కార్తీక్

TG: బీఆర్ఎస్ MLAలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబిత కుమారుడు, బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి(యూట్యూబ్ ఛానెల్స్) లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.
Similar News
News December 12, 2025
100 KGలకు పైగా బరువు పెరిగే మేకలివి

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి బోయర్ జాతి మేకలు. ఇవి దక్షిణాఫ్రికాకు చెందినవి. అతి వేగంగా బరువు పెరగడం, నాణ్యమైన రుచిగల మాంసం, దృఢమైన శరీర నిర్మాణం ఈ మేకల ప్రత్యేకత. ఇవి కేవలం 3 నెలల్లోనే 20 కిలోలు, ఏడాదికి 70KGలకు పైగా బరువు పెరుగుతాయి. వీటిలో మగ మేకలు గరిష్ఠంగా 110-125 కిలోలు, ఆడ మేకలు 90-100 కిలోల బరువు పెరుగుతాయి. ఈ మేకల గురించి మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 12, 2025
కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్‌గా గెలుపు

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్‌గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.
News December 12, 2025
AP న్యూస్ రౌండప్

* నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు ఈ నెల 15న తీర్పు ఇవ్వనుంది.
* చంద్రబాబుపై ఫైబర్‌నెట్ కేసును మూసేయడాన్ని సవాల్ చేస్తూ YCP నేత గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ACB కోర్టు వెల్లడించింది.
* నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసులు PD యాక్ట్ నమోదు చేశారు.
* ఈ నెల 10న ఒక్కరోజే 1,46,607 టన్నుల ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించాం: మంత్రి నాదెండ్ల


