News March 19, 2024

రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమలలో మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను కనువిందు చేయనున్నారు.

Similar News

News December 9, 2025

ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే..

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు గడువు సమీపించింది. నేటితో 4,236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి విడత పోలింగ్ సాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.

News December 9, 2025

పేరెంట్స్‌కు పిల్లలకు మధ్య న్యూరో సింక్రోని

image

తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండే న్యూరో సింక్రోని వల్లే పిల్లల్లో భాష, జీవన నైపుణ్యాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ నియంత్రణకు, ప్రేమ, అనుబంధాల ప్రేరణకు న్యూరో సింక్రోని కీ రోల్ పోషిస్తుంది. అలాగే అమ్మ మాట, పాట వంటివి పిల్లలల్లో నాణ్యమైన నిద్రకు కారణం అవుతాయి. పేరెంట్స్ కారణంగా తాను సురక్షితంగా ఉన్నాను అనే భావనను న్యూరో సింక్రోని పెంపొందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

News December 9, 2025

ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.