News March 27, 2024

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?

image

TG: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపారట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.

News February 18, 2026

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

image

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.