News May 7, 2025
ఇజాన్‌కు పాలు ఇవ్వలేక కుంగిపోయా: సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన అమ్మతనం అనుభవాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘ఇజాన్ పుట్టిన తర్వాత 3 నెలలే పాలిచ్చా. కొడుక్కి పాలిచ్చే క్రమంలో శారీరకంగా, మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలోనే ఆటపరంగా, ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నాకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టమనిపించింది. ఆ తర్వాత నా శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ పలికా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News February 9, 2026
పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News February 9, 2026
పెరిగిన ఎండలు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. TGలోని ప్రధాన నగరాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు, హనుమకొండ, మెదక్, నిజామాబాద్‌లో 32 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొంది. అటు ఏపీలోని కావలిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా రికార్డైంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
News February 9, 2026
ఆముదంతో వృద్ధాప్య ఛాయలు దూరం

ఆముదం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. ఆముదం ముఖ ముడతలకు సహజమైన చికిత్స. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దానిలో హైడ్రేటింగ్, పోషకాలు లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా మృదువుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


