News January 13, 2025

చంద్రబాబు వచ్చాకే ప్రతి ఇంటా సంక్రాంతి ఆనందాలు: టీడీపీ

image

AP: ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం చేసి సంక్రాంతి ఆనందం లేకుండా చేశారని టీడీపీ Xలో విమర్శించింది. CBN పాలన ప్రారంభమయ్యాక తొలి సంక్రాంతికే ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపింది. జగన్ విధ్వంసంతో ప్రతి రోజూ రాష్ట్రంలో అలజడిగా ఉండేదని, చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనతో రోజూ పండుగలా ఉందని పేర్కొంది. రైతులు, పేదలు, యువత ఎంతో సంతోషంగా ఉన్నారని, ఛార్జీలు పెంచలేదని రాసుకొచ్చింది.

Similar News

News February 12, 2025

సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి

image

ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.

News February 12, 2025

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యం: భట్టి

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో క్యాబినెట్‌లో తీర్మానం చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘శాసనసభలో బిల్లు ఆమోదించి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లు కేంద్రానికి పంపి ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం. బీసీల రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే మా లక్ష్యం’ అని భట్టి స్పష్టం చేశారు.

News February 12, 2025

నేరం అంగీకరించిన వీర రాఘవరెడ్డి

image

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. తన ‘రామరాజ్యం’ సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను రాఘవరెడ్డి గతంలో కోరారు. ఆయన అంగీకరించకపోవడంతో ఈ నెల 7న ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా, 16 మంది పరారీలో ఉన్నారు.

error: Content is protected !!