News August 27, 2024
‘సరిపోదా శనివారం’ నిడివి 2 గం. 54 నిమిషాలు: సెన్సార్ బోర్డ్

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఎల్లుండి రిలీజ్ కానుంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్‌ను సినీవర్గాలు షేర్ చేస్తున్నాయి. సినిమా పూర్తిగా 2 గం. 54 నిమిషాల నిడివితో ఉండనుంది. మూవీలో ఏ సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, రెండుచోట్ల ఓ పదాన్ని మ్యూట్ చేయాలని, మరోచోట ధూమపాన నిషేధం ట్యాగ్ ఇవ్వాలని పేర్కొంది.
Similar News
News January 22, 2026
రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు దొరికిందా?

రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకడం యాదృచ్చికం కాదని, భగవంతుడి సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ‘నాణెం దొరికితే కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. నోటు దొరకడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచిక. ఇలా దొరికిన సొమ్మును ఖర్చు, దానం చేయకూడదు. దైవ ప్రసాదంగా భావించి, పర్సు/పూజా గదిలో భద్రపరచాలి. తద్వారా మనిషికి/ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం వేళ డబ్బు దొరకడం రెండింతలు అదృష్టం’ అంటున్నారు.
News January 22, 2026
SECLలో 66 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (<
News January 22, 2026
గిల్ డకౌట్.. సర్ఫరాజ్ సెంచరీ

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ నిరాశపరిచారు. సౌరాష్ట్రతో మ్యాచులో ఈ పంజాబ్ బ్యాటర్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ హైదరాబాద్‌పై సెంచరీ బాదారు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.


