News May 2, 2024

అలాంటి వారిలో సత్యదేవ్ ఒకరు: రాజమౌళి

image

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సత్యదేవ్ ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటిస్తారని కొనియాడారు. పూర్తిస్థాయి నటన కనబరిచే కొద్ది మందిలో సత్య ఒకరని ప్రశంసించారు. ఇలాంటి టాలెంటెడ్ నటులను ఏదో ఒక సినిమా స్టార్ చేస్తుందన్నారు.

Similar News

News December 16, 2025

ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

image

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)

News December 16, 2025

42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

image

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్‌గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.

News December 16, 2025

ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్‌లో 70% వాటా!

image

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్‌నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్‌ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్‌సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT