News August 6, 2024
ఆర్థిక కష్టాల నుంచి ఏపీని కాపాడండి: TDP MP

AP ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోందని TDP MP శ్రీకృష్ణదేవరాయలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అన్నారు. కేంద్రం అండగా ఉండి, రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని కోరారు. ఇప్పటికే AP ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని ఆక్వా ఎగుమతుల్లో 70% AP నుంచే జరుగుతున్నాయని, PM మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ఆదుకోవాలని MP విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 17, 2025
స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధం: BRS ఎమ్మెల్యే

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ <<18592868>>తీర్పు<<>> రాజ్యాంగవిరుద్ధమని BRS ఎమ్మెల్యే వివేకానంద ఫైరయ్యారు. ఆయన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనర్హత పిటిషన్లను వేటి ఆధారంగా డిస్మిస్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని, స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని మండిపడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు MLAలను రాజీనామా చేయించి ఉపఎన్నిక నిర్వహించాలని సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు.
News December 17, 2025
స్పీకర్ నిర్ణయంతో BRSకు షాక్

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న <<18592868>>MLA<<>>లపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయని BRS ఆశించింది. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడుతోంది. కానీ తాజాగా స్పీకర్.. ఐదుగురు MLAలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయంతోనే ఏకీభవించనుంది. దీంతో ఉపఎన్నికల్లో గెలుస్తామని భావించిన కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఇప్పటికే 2 ఉపఎన్నికల్లో BRS ఓటమిపాలైన విషయం తెలిసిందే.
News December 17, 2025
AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.


