News November 23, 2024
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలి: మంత్రి పొన్నం
ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా రవాణా శాఖ ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. స్కూల్ బస్సులను నిరంతరం తనిఖీలు చేస్తూ, 15 ఏళ్లు దాటిన వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉన్నతాధికారుల సమీక్షలో సూచించారు. రవాణా శాఖకు ప్రత్యేక లోగో రాబోతుందని వివరించారు. ఈ శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 24, 2024
నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్‌ని గౌరవిస్తున్నాం: కెనడా
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తాము గౌరవిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే తామెప్పుడూ పనిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే యూకే, బెల్జియం, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, ఇరాన్, ఐర్లాండ్, జోర్డాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, టర్కీ దేశాలు వారెంట్‌ను అంగీకరించాయి.
News November 24, 2024
దేశ రాజకీయాల్లో పరాన్న జీవిగా కాంగ్రెస్: మోదీ
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హరియాణాతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఖాళీ అయిందని సెటైర్లు వేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని, అది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమని చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాలేదని ప్రధాని స్పష్టం చేశారు.
News November 24, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 24, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:10 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.