News December 3, 2025
SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
Similar News
News February 17, 2026
హైదరాబాద్ గడ్డపై ప్రపంచ ప్యాకేజింగ్ ‘దంగల్’

64 ఏళ్ల ఐసీసీఏ (ICCA) చరిత్రలో తొలిసారి HYDకు గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యం దక్కింది. 2027 జనవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్‌తో తెలంగాణ పేరు గ్లోబల్ ఇండస్ట్రియల్ మ్యాప్‌లో మారుమోగిపోనుంది. రూ.55 వేల కోట్ల విలువైన దేశీ ప్యాకేజింగ్ రంగానికి ఈ సదస్సు ఊపిరి పోయనుంది. హైదరాబాద్ దిగ్గజాలు ఎం.ఎల్. అగర్వాల్, అంకిత్ అగర్వాల్ సారథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. రేపు కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుగుతోంది.

సిద్దిపేట: 22న తెలంగాణ వీటీజీసీఈటీ ప్రవేశ పరీక్ష

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వీటీజీసీఈటీ (VTGCET) ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి డా.శారదా వెంకటేశ్ తెలిపారు. ఈ పరీక్ష ద్వారా 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.