News April 26, 2024

రెండో దశ పోలింగ్ 60.7%@5PM

image

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/యూటీల్లో 88 స్థానాలకు జరిగిన లోక్‌సభ రెండో విడత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశించినంత నమోదు కాలేదు. 5 గంటలకు 60.7% మాత్రమే నమోదైంది. మణిపుర్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో పోలింగ్ 70% దాటింది. మరోవైపు యూపీ, బిహార్, మహారాష్ట్రలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. యూపీలో 52.6%, బిహార్‌లో 53%, మహారాష్ట్రలో 53.5%గా రికార్డ్ అయింది. <<-se>>#Elections2024<<>>

Similar News

News April 16, 2026

విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

image

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.