News April 27, 2024
అబద్ధాలు చెప్పే ప్రధానిని తొలిసారి చూస్తున్నా: ప్రియాంక

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఆయనలా అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడలేదని మండిపడ్డారు. ‘మా నానమ్మ ఇందిర, మా నాన్న, మన్మోహన్, వాజ్‌పేయీ లాంటి ఎంతోమంది ప్రధానుల్ని చూశా గానీ బహిరంగంగా అబద్ధాలు చెప్పే ప్రధానిని తొలిసారి చూస్తున్నా. నా తాతయ్య నుంచి నా భర్త, సోదరుడి వరకు అందర్నీ దూషిస్తున్నారు. కానీ వారి విమర్శల్ని మేం పట్టించుకోవడం లేదు’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
Similar News
News April 16, 2026
కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్‌ల వద్ద పక్కాగా నివారణ చర్యలు తీసుకోవడం వల్ల 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. గాంధారిలో గురువారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ కోరారు.
News April 16, 2026
భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.
News April 16, 2026
HMTలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్ట్ పద్ధతిలో 2 డిప్యూటీ ఇంజినీర్, 2 ఆఫీసర్ పోస్టుల భర్తీకి HMT దరఖాస్తులను కోరుతోంది. మెకానికల్/ప్రొడక్షన్‌లో 60% మార్కులతో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. జీతం నెలకు రూ.16,400-రూ. 40,500. వయసు 30 ఏళ్లు దాటకూడదు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి APR-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.hmtindia.com చూడండి.


