News August 11, 2025

సంచలనం: 5 బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు

image

అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్ 2025లో సంచలనం నమోదైంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 5 బంతుల్లో టార్గెట్‌ను ఛేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 19 ఓవర్లు ఆడి 23 పరుగులే చేసింది. ఏడుగురు డకౌటయ్యారు. కెనడా బౌలర్ జగ్‌మన్‌దీప్ 6 వికెట్లు తీసి 7 రన్స్ ఇచ్చారు. అనంతరం 24 పరుగుల టార్గెట్‌ను కెనడా 0.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ యువరాజ్ ఒక్కడే 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.

Similar News

News March 6, 2026

దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

News March 6, 2026

10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

image

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.

News March 6, 2026

రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.