News September 11, 2025

SEP 17న సాయుధ పోరాట దినోత్సవం: MLA

image

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న ప్రజాపాలన దినోత్సవం కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని HYDలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్‌ చేశారు. 1947 SEP 11న పోరాటం ప్రారంభమైందని, ఆ పోరాట యోధుల విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 14, 2025

SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

image

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.

News December 14, 2025

డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

image

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.

News December 14, 2025

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్

image

IT కారిడార్‌లో ట్రాఫిక్‌ను దెబ్బతీస్తున్న కీలకమైన ICCC నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 9KM ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్ట్‌కు HMDA పచ్చజెండా ఊపింది. తాజాగా DPR కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌లను ఇన్వైట్ చేసింది. 11.6 కి.మీ. PVNR Expresswayను పోలిన ఈ నూతన మార్గం, నగరంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్‌ వెస్ట్ సిటీకి పర్మినెంట్ ట్రాఫిక్ సొల్యూషన్ అందించనుంది.