News May 7, 2025

సమాజానికి సేవ చేస్తే ఆ ఆనందమే వేరు: తమన్

image

సమాజానికి సేవ చేస్తే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన తలసేమియా సెంటర్ ప్రారంభించారు. ‘నారా భువనేశ్వరి చేసే మంచి పనులకు నేనెప్పుడూ అండగా ఉంటా. తలసేమియా రోగుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలని ప్రచారం చేస్తా. జనాలకు మనం ఎంతో కొంత తిరిగిస్తేనే సంతోషం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 19, 2026

GK: ఫిబ్రవరిలో ముఖ్య రోజులు

image

feb 4: ప్రపంచ క్యాన్సర్ దినం
feb 10: ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం
feb 11: అంతర్జాతీయ బాలిక, మహిళల విజ్ఞాన దినోత్సవం
feb 13: ప్రపంచ రేడియో దినోత్సవం
feb 20: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
feb 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
– ప్రతిరోజూ 2amకు జనరల్ నాలెడ్జ్ కంటెంట్ పొందండి

News February 19, 2026

వాళ్లు ఇండియాను ఓడించలేదు: పాక్ క్రికెటర్

image

ఇండియాతో మ్యాచ్‌లో పాక్ <<19153355>>ఘోరంగా<<>> ఓడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తమపై <<19155191>>తీవ్ర విమర్శలు<<>> చేస్తున్న మాజీలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు దిగ్గజాలు. కానీ మేం చేసినట్లు వాళ్లు చేయలేదు. మేం ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించాం. అయినా విమర్శలనేవి క్రికెట్ చరిత్రలో భాగం’ అని అన్నారు. 2021 T20 WCలో ఇండియాపై పాక్ గెలిచింది.

News February 19, 2026

ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

image

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం