News August 3, 2024
SGB స్కీమ్: కేంద్రం షాకివ్వనుందా?

సావరిన్ గోల్డ్ బాండ్స్. చాలామందికి ఇష్టమైన స్కీమ్. ఏటా 2.5% వడ్డీ, మెచ్యూరిటీ తీరాక గోల్డ్‌కు సమాన రాబడి, LTCG వర్తించకపోవడం దీని బెనిఫిట్స్. అయితే ప్రభుత్వం దీన్ని నిలిపేయొచ్చని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఫిజికల్ గోల్డుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ పూడ్చుకొనేందుకు SGBపై పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉందట. పైగా ఇది సోషల్ సెక్టార్ స్కీమ్ కాదు. కొన్నిరోజుల్లో స్పష్టత రావొచ్చు.
Similar News
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

<
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.


