News March 26, 2024

నటిలా కనిపించాలని 100 సర్జరీలు చేయించుకుంది

image

చైనాకు చెందిన ఝౌ చునా(18) అనే యువతి తన అభిమాన నటి ఎస్తేర్‌లా కనిపించాలని 100కుపైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. ఈ శస్త్ర చికిత్సల కోసం ఏకంగా ₹4 కోట్లు ఖర్చు చేశారు. 13 ఏళ్ల వయస్సు నుంచి ప్రతిసారీ కొత్త వైద్యులను సంప్రదిస్తూ ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. ప్రస్తుతం ఎవరూ గుర్తించలేనంతగా ఆమె మొఖం మారడంతో ఆ రూపం తల్లిదండ్రులకీ నచ్చలేదు. దీంతో తాజాగా సర్జరీ ప్రయత్నాలను విరమించుకున్నారు.

Similar News

News February 11, 2026

నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

image

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్‌పాల్‌కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.

News February 11, 2026

మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

image

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.

News February 11, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.