News March 13, 2025
బీటెక్ విద్యార్థులకు షాక్!

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ కమిషన్ (TAFRC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీబీఐటీ, VNR, వాసవి, MGIT లాంటి కొన్ని కాలేజీల్లో 50% వరకు పెంపును ప్రతిపాదించింది. CBITలో ఫీజు రూ.1.65 లక్షలు ఉండగా ఏకంగా రూ.2.40 లక్షలకు పెరగనుంది. కాలేజీల నిర్వహణ, ప్రొఫెసర్ల జీతాలు, సదుపాయాలను పరిశీలించి TAFRC ఫీజుల పెంపును ప్రతిపాదిస్తుంది.
Similar News
News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.
News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
News February 19, 2026
5,349 పోస్టులకు నోటిఫికేషన్

<


