News August 11, 2025

సైబర్ నేరగాళ్లకు షాక్.. వెంటనే సిమ్ బ్లాక్

image

సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇవ్వనుంది. అనుమానితుల లొకేషన్లు, బ్యాంకు, టెలికాం వివరాలను తక్షణమే అన్ని పీఎస్‌లకు పంపేలా చర్యలు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. త్వరలోనే TGలో సెమినార్ నిర్వహించనుంది.

Similar News

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.

News March 9, 2026

నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

News March 9, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.