News May 7, 2025
CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

IPL: ఓటములు(7), నెట్ రన్ రేటు(-1.302) ప్రకారం CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లడం అసాధ్యం. ఏదైనా మిరాకిల్ జరిగితే గ్రూప్ స్టేజ్ దాటొచ్చు. చెన్నై తర్వాతి 5 మ్యాచ్‌లనూ(vsPBKS, RCB, KKR, RR, GT) భారీ మార్జిన్లతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టుకూ 14 పాయింట్లు రాకపోతే ఛాన్స్ ఉంటుంది. 2024లో 4 టీమ్స్(CSK, DC, LSG, RCB)కు 14 పాయింట్లు రాగా NRRను బట్టి RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.
Similar News
News February 12, 2026
స్కూళ్లకు బంద్ లేనట్లే..!

భారత్ <<19115946>>బంద్<<>> ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై అంతగా లేనట్లు తెలుస్తోంది. ఇవాళ స్కూల్‌కు సెలవు అని మెసేజులు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనట్లేదు కాబట్టి అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. బ్యాంకులు, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇవాళ స్కూళ్లకు హాలిడే అని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News February 12, 2026
చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. 6నెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డు, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News February 12, 2026
రష్యాలో వాట్సాప్ బ్లాక్!

వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్‌లో కంట్రోల్ కోసం సొంత యాప్స్‌ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వాట్సాప్ డొమైన్స్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్‌ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.


