News May 2, 2024
ఎన్నికలంటేనే ఇన్ని హామీలు ఉండాల్సిందేనా?

ఎన్నికలంటేనే హామీల వర్షాలు. ఒక పార్టీని మించి మరో పార్టీ ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తుంటాయి. ఒక్కోసారి హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి ప్రజలే ఇన్ని హామీలు అడుగుతున్నారా? పార్టీలే ప్రజలను హామీల ఉచ్చులో పడేస్తున్నాయా? అంటే ఎవరూ దానికి సమాధానం చెప్పలేరు. రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టే ఈ హామీలపై మీరేమంటారు? ప్రజలకు ఏమి అవసరమో కామెంట్ చేయండి.
Similar News
News December 7, 2025
బేబీ గ్రోత్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

తల్లి గర్భంలో పిండం ఎదుగుదల తెలుసుకోవడానికి ముందు వయసు సరిగా నిర్ధారించుకోవాలి. మూడు నెలలకు ఓసారి స్కాన్ చేయించాలి. తల్లి అధిక బరువు ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా..35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల పిండం బరువు పెరగక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిండం ఎదగనప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి. తల్లి కడుపు నుంచి రక్తం ఆగి ఆగి వెళ్లడంగానీ వెనక్కి వచ్చినా పిండం కడుపులోనే చనిపోవచ్చు.
News December 7, 2025
పుతిన్ వెళ్లారు.. జెలెన్‌స్కీ వస్తున్నారు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


