News March 28, 2024
తెలంగాణకు ఏపీ సర్కారు అద్దె కట్టక తప్పదా..?

తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆఫీసులు భవనాలను, అతిథి గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కొనసాగించాలనుకుంటే అద్దె కట్టక తప్పదు. ఖాళీ చేయడమా లేక అద్దె చెల్లించి ఉండటమా అనే అంశంపై ఏపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూన్ 2 నాటికి ఏపీలో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ లేని నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
Similar News
News February 9, 2026
రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలు

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. RR జిల్లాలోని 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా..వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500-800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి,ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది.
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్


