News February 18, 2025

ప్రేయసిని పెళ్లి చేసుకున్న సింగర్

image

సింగర్ అనువ్ జైన్ పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి హృది నారంగ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నెల 14న సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగగా తాజాగా సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా బ్రేకప్ సాంగ్స్ పాడటంలో అనువ్ జైన్‌కు మంచి పేరుంది.

Similar News

News April 14, 2026

అరుణాచల్ ప్రదేశ్‌ మాదే: చైనా

image

అరుణాచల్ ప్రదేశ్‌లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్‌గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్‌ను జాంగ్‌నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.

News April 14, 2026

వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

image

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్‌సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.

News April 14, 2026

ఎన్నికలు ముగిశాక పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం: Macquarie

image

క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని Macquarie అనే గ్రూప్ తెలిపింది. బ్యారెల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ చివర్లో తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.