News April 12, 2024
SIRAJ: వరల్డ్ కప్ ఆడాలని లేదా మియా?

టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ IPLలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అతడి గణాంకాలు చూసి ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. సిరాజ్ దారుణ ప్రదర్శన చూసి నిరాశ చెందుతున్నారు. ఈ IPLలో 6 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లే తీశారు. మరోవైపు పరుగులు కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సిరాజ్ తిరిగి తన ఫామ్ అందుకుంటే మంచిదని.. లేదంటే T20 WCలో చోటు కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్‌నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.
News December 16, 2025
CLAT-2026 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <


