News March 7, 2025
వివేకా హత్య కేసు సాక్షుల మృతిపై సిట్ ఏర్పాటు

AP: వివేకా హత్య కేసు సాక్షులు ఎలా చనిపోయారనే దానిపై సిట్ ఏర్పాటు చేశామని కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘సిట్‌లో ఇద్దరు DSPలు, ముగ్గురు CIలు, ఇద్దరు SIలు, 10మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇటీవల చనిపోయిన రంగన్న మృతిపై అనుమానాలున్నాయి. జగన్ కారు డ్రైవర్ నారాయణ మృతిపైనా దృష్టి పెట్టాం. సాక్షులు కోరితే భద్రత కల్పిస్తాం’ అని SP తెలిపారు.
Similar News
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

<
News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.


