News June 10, 2024

మణిపుర్‌లో పరిస్థితి అదుపులోనే ఉంది: పోలీసులు

image

మణిపుర్‌లోని జిరిజామ్ జిల్లాలో ప్రస్తుతానికి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. శనివారం కొందరు అరాచకవాదులు మైతేయి, కుకీ తెగల వారికి చెందిన 70ఇళ్లను తగలబెట్టారు. పోలీస్ అవుట్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ హింసను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అదనపు బలగాలను తరలించింది. జిల్లా SPని బదిలీ చేసింది. ఓ వ్యక్తి హత్యతో అక్కడ ఆందోళనలు చెలరేగినట్లు సమాచారం.

Similar News

News December 21, 2024

నిద్రలో ఎందుకు కలవరిస్తారంటే?

image

కొందరు నిద్రలోనే మాట్లాడుతుంటారు. కొంతమంది గొణగడం చేస్తే, మరికొందరు స్పష్టంగా గట్టిగా కలవరిస్తుంటారు. 3 నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లలు, కొందరు పెద్దలు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాము చేసిన పని గురించి, కలలతో సంబంధం ఉన్నా, కొన్ని రకాల మందులు వాడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ అలవాటు వస్తుంది.

News December 21, 2024

ఇన్సూరెన్సులు కట్టేవారికి నో రిలీఫ్

image

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు ప్రీమియంలపై జీఎస్టీ భారం తగ్గనుందనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇన్సూరెన్సుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని తగ్గించనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల ప్రకటనతో క్లయింట్లకు నిరాశే ఎదురైంది.

News December 21, 2024

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

చెక్కర అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల జీవితంలో కొంత కాలాన్ని కోల్పోతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోక్ లాంటి కూల్‌డ్రింక్ తాగితే 12 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని తెలిపారు. ఇది తాగిన తర్వాత ఊబకాయం, మధుమేహం వంటివి సోకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హాట్ డాగ్ తింటే 36 నిమిషాలు, శాండ్‌విచ్‌లు తింటే 13 నిమిషాలు, చీజ్‌బర్గర్‌లు తింటే జీవితంలో 9 నిమిషాలను కోల్పోతారు.