News November 6, 2025
SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.
Similar News
News January 22, 2026
నరసన్నపేటలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు..వైసీపీ ఆరోపణ

నరసన్నపేట మండలం తామరపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నట్లు వైసీపీ ఆరోపించింది. ఈ కట్టడాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, అధికార పార్టీ నాయకుల అండతోనే నిర్మాణాలు చేపడుతున్నా.. యంత్రాంగం అడ్డుకోలేదని వైసీపీ విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది.
News January 22, 2026
SKLM: KR స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా, శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KR స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ విషయంలో ఎంట్రీలు, ఎగ్జిట్ అత్యవసర సమయాల్లో ప్రత్యేక మార్గాలు వినియోగంపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. DSP వివేకానంద, RDO కృష్ణమూర్తి ఉన్నారు.
News January 22, 2026
అరసవెల్లి: రథసప్తమికి దర్శన టోకెన్ల ధరలు ఇలా..!

అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 24న జరగనున్న రథసప్తమి ఉత్సవాలలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనం, రూ.100 దర్శనం, రూ.300, వీఐపీ దర్శనాలు కోసం ఒక్కోదానికి రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా పంపించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి మీడియా పాయింట్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.


