News April 9, 2024
SKLM: ఉగాది ఎఫెక్ట్.. బంగారం షాపులు కిటకిట

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.
Similar News
News March 19, 2025
ఎచ్చెర్ల: భార్యపై అనుమానంతో హత్య

ఎచ్చెర్ల మండలంలో భార్యను, భర్త దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్లలోని సంతసీతాపురానికి చెందిన నాగమ్మ(40), అప్పలరెడ్డి కూలిపనులు చేస్తూ జీవనం సాగించేవారు. భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో తల, మెడలపై దాడి చేయగా ఆమె మృతి చెందింది. కుమారుడు త్రినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ అవతారం తెలిపారు.
News March 19, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీ ఐ)లో ఈనెల 20 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 19, 2025
SKLM: పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.