News May 23, 2024
SKLM: కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. స్వస్థలాలకు విద్యార్థులు!

కిర్గిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాం విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన మొదలైన అల్లర్లు ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని భావించి ఇంటి దారి పట్టారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరుకు స్వదేశం వచ్చేలా విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలకెళ్లి చదువుకోలేకపోతున్నామని వారు తెలిపారు.
Similar News
News March 16, 2026
బూర్జ: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన బూర్జ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పినివలస గ్రామానికి చెందిన జీవన్ కుమార్ (32) తన పనులను ముగించుకొని కొల్లివలస నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు నమోదైంది.
News March 16, 2026
శ్రీకాకుళం: పది పబ్లిక్ పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

జిల్లాలో నేడు ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు ముందే OMR షీట్ పై ఫోటో, పేరు, రోల్ నంబర్ సరిచూసుకోవాలి. విద్యార్థులకు 24 పేజీల మెయిన్ బుక్లెట్, అవసరమైతే 12 పేజీల అదనపు బుక్లెట్ అందిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులను కచ్చితంగా నిషేధించారు.