News November 5, 2025
SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్‌పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News January 19, 2026
మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 19, 2026
SKLM: నేటి నుంచి సురభి నాటక వైభవం

కళల కాణాచి శ్రీకాకుళం నగరంలో పౌరాణిక నాటక సందడి మొదలవనుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియం వేదికగా సోమవారం (జనవరి 19) నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.
News January 19, 2026
SKLM: నేడే హెలికాప్టర్ రైడ్..టికెట్ ధర ఎంతంటే?

రథసప్తమి వేడుకల సందర్భంగా సోమవారం (జనవరి 19) నుంచి హెలికాప్టర్ రైడింగ్ జరుగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆఫ్‌లైన్‌లోనే 3 కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ రైడింగ్ చేసేవారు రూ.2,200 టికెటు తీసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుంచే మొదలై, రోజుకు 200-250 మంది వరకు రైడ్‌లో వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.


