News August 3, 2024
SKLM: డీసీఎం- లారీ ఢీ, తప్పిన పెను ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిధిలోని వాకలవలస జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోడ్డులో వాహనాలు రాకపోకలు ఎక్కువ ఉండడంతో మరింత ట్రాఫిక్ సమస్య నెలకొంది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్ ని క్లియర్ చేసి క్రమబద్ధీకరించారు
Similar News
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
News December 13, 2025
పొందూరు బ్రాండ్.. అద్భుత ట్రెండ్!

మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత ప్రముఖుల మనసుదోచుకున్న వస్త్రం పొందూరు ఖాదీ. ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనాన్ని ఇవ్వడం ఈ వస్త్రం ప్రత్యేకత. ఇంతటి ఖ్యాతి గడించిన ఖద్ధరకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిన్న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ కీర్తి వచ్చేలా కేంద్రమంత్రి రామ్మోనాయుడు కృషి చేయడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 13, 2025
SKLM: ‘యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి’

ప్రస్తుత రబీ పంటకు సంబంధించిన మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల్లోని రైతు సేవా కేంద్రాలు (ఆర్బీకేలు), పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు కొరత లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2379 యూరియా నిల్వ ఉందన్నారు.


