News August 13, 2025
SKLM: పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తాం

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. కోస్టల్ కారిడార్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తీరప్రాంత వెంబడి పరిశ్రమలు స్థాపిస్తే ఏపీఐఐసీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. MLA శంకర్ పాల్గొన్నారు.
Similar News
News March 6, 2026
SKLM: టెన్త్ విద్యార్థుల్లారా.. మీ ఫోన్‌కే హాల్ టికెట్

ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ హాల్ టికెట్‌లను ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఫోన్ నంబర్ 9552300009లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంపిక చేసి ‘హాయ్’ అని మెసేజ్ చేసి తగు వివరాలు ఎంటర్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. జిల్లాలో 3014 స్కూల్స్ నుంచి 29,398 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
News March 6, 2026
శ్రీకాకుళంలో ఆ అద్భుత ఘట్టానికి వేళాయే

శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి ఆదిత్యుని మూలవిరాటుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఆలయ ఈవో K.N.V.D.V ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి.
News March 5, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

☞ఎచ్చెర్ల: వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం
☞శ్రీకాకుళం: మహిళ భద్రతకు ప్రాధాన్యత
☞ఈనెల 9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ స్పర్శ
☞నరసన్నపేట: శవ గదికెళ్లాలంటే పరీక్షే
☞శ్రీకాకుళంలో మర్డర్..నిందితుడి అరెస్ట్
☞అచ్చెన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పేరాడ తిలక్
☞SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు
☞కరగాం: గుండెపోటుతో యువ ఇంజినీర్ మృతి


