News November 27, 2024

SKLM: పొందూరు సింహాచలంపై ACB సోదాలు

image

ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.

Similar News

News December 2, 2024

పలు కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR. అంబేద్కర్ యూనివర్సిటీలో పలు కోర్సులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బీటెక్ 5వ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి, 7వ సెమిస్టర్ 13వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అలాగే పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి బీపీఈడీ, డీపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలు కూడా డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.

News December 2, 2024

నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి  సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.

News December 2, 2024

SKLM: శీతాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: DM&HO

image

గ్రామాల్లో అభయ కార్డుల జారీ, క్యాన్సర్‌పై సర్వే ముమ్మరంగా సాగుతోందని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. ప్రజలు ఈ సర్వేలో తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయన్నారు. శీతాకాలం వ్యాధులు విజృంభించకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.