News March 15, 2025
SKLM: పొట్టి శ్రీరాములు జయంతికి కలెక్టర్ పిలుపు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శ్రీకాకుళం పాత బస్ స్టాండ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు హాజరై నివాళులర్పించాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 17, 2026
శ్రీకాకుళం: చలిలో ఎలా పడుకుంటున్నారో పాపం

శ్రీకాకుళంలోని నాగావళి నది బ్రిడ్జిపై కనిపిస్తున్న ఈ దృశ్యం అభాగ్యుల దీనస్థితిని కళ్లకు కడుతోంది. ప్రస్తుతం ఉన్న చలికి ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేస్తేనే వణికిపోతున్నాం. అలాంటిది కొన్ని రోజులుగా మంచు వర్షంలా కురుస్తున్నా ఇలా వరుసగా ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్నారు. ఆ మంచుకి రగ్గులు కూడా తడిసిపోతున్నాయి. వెన్ను వణికించే చలిలో పాపం ఎలా పడుకుంటున్నారో అని ప్రయాణికులు జాలి పడుతున్నారు.
News February 17, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤ఎల్.ఎన్ పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోట్లు వచ్చిన ఆనందం
➤మందస: పొక్సో కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
➤ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే బగ్గు
➤టెక్కలికి ఆయుష్ ఆసుపత్రి మంజూరు: అచ్చెన్న
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 39, కలెక్టర్ గ్రీవెన్స్‌కు 94 వినతులు
➤పలాసలో అక్రమ గ్రావెల్ తరలింపు
News February 16, 2026
ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.


