News August 13, 2025
SKLM: సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

పోలీస్ కుటుంబ సభ్యులకు సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా SP మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళం SP కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని, బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 9, 2026
SKLM: విద్యార్థులు అలర్ట్.. ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్ డే

ఎచ్చెర్లలోని డాక్టర్ B.R.అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ 2021-22, 2022-23, 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ ఆరో సెమిస్టర్ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు రూ.1425లను ఆయా కళాశాలలో, యూనివర్సిటీకి వచ్చి చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ ఎం.అనురాధ ప్రకటనలో వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో ఈ నెల 10 వరకు, రూ.1500 ఫైన్‌తో 11 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు అన్నారు.
News March 9, 2026
శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.
News March 9, 2026
మగపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా పోలీసు శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే, మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.


