News August 13, 2025
SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం కోర్ట్ ఆవరణలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రాజీలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు విషయంలో అధిక శ్రద్ధ వహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.
Similar News
News March 9, 2026
మగపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా పోలీసు శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే, మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 8, 2026
SKLM: మహిళా సంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్

జిల్లాలో మహిళాసంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్ లింకేజీ అందించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.
News March 8, 2026
శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.


