News April 20, 2024

సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం: వీహెచ్

image

TG: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. తమ్ముడిగా భావించిన భట్టి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో రేవంత్ సీఎం అవుతారని మాట్లాడినందుకే తనపై కక్ష కట్టారన్నారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయటి వారిని తీసుకొస్తున్నారని.. దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 15, 2025

రేపటి నుంచి ‘ధనుర్మాసం’ ఆరంభం!

image

పరమ పవిత్రమైన ధనుర్మాసం రేపటి నుంచి (DEC 16) మొదలవుతుంది. ఈ మాసం విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. ఈ పుణ్యమాసంలోనే శ్రీకృష్ణుడిని పతిగా పొందాలని గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావై పాశురాలను ఆలపిస్తారు. ఈ తిరుప్పావై గానం ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆ పాశురాలు, ధనుర్మాసంలో చేయాల్సిన పూజలు, వ్రతాల ప్రాముఖ్యత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 15, 2025

ధనుర్మాసంలో ఆచరించాల్సిన పూజలు, వ్రతాలు

image

ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. అనేక రకాల వ్రతాలను ఆచరిస్తారు. అందులో గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రధానమైనది. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథులను పూజిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం వచ్చే మార్గశీర్ష వ్రతం మనలో సత్వగుణాన్ని పెంచుతుంది. వీటితో పాటు శ్రీవ్రతం, సిరినోములను ఆచరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఇంట్లో సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.

News December 15, 2025

నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్

image

H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది. ఈ ప్రక్రియను ‘వెట్టింగ్‌’గా పిలుస్తున్నారు. దరఖాస్తుదారులంతా SM సెట్టింగులను ప్రైవేటు నుంచి పబ్లిక్ మార్చుకోవాలని US విదేశాంగ శాఖ సూచించింది. ‘ప్రతి వీసా నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ కోణంలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్లు దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని మేం నమ్మాలి’ అని పేర్కొంది.