News March 9, 2025
SLBC వద్ద భయం.. భయం.!

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను కట్ చేస్తే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News January 14, 2026
NTR: సారోళ్లు రూల్స్ చెప్తారు.. అమలు చేయరు.!

సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ పతాక స్థాయికి చేరింది. HYD నుంచి APకి వెళ్లే బస్సు టికెట్ ధరలు రూ.6వేలు దాటడం గమనార్హం. ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామన్న రవాణా శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
News January 14, 2026
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.
News January 14, 2026
అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.


